మేడ్చల్: ఎల్బీనగర్ వద్ద అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన కారు
ఎల్బీనగర్ డీమార్ట్ సమీపంలో సోమవారం కారు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు యూటర్న్ వద్ద ఉన్న డివైడర్ను ఢీకొట్టి దానిపైకి ఎక్కింది. అదృష్టవశాత్తూ బస్టాప్ వద్ద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారులో ఉన్నవారి వివరాలు తెలియాల్సి ఉంది.