శ్రీశైలం: మహానంది మండలంలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించిన మహానంది వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్లు
మహానంది వ్యవసాయ కళాశాల మహానంది అసోసియేట్ డీన్ డా.వి.జయలక్ష్మి ఆధ్వర్యంలో తిమ్మాపురం మరియు అబ్బిపురం గ్రామలలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భూసార పరీక్ష ప్రాముఖ్యత మరియు వాటి ఫలితాల ఆధారంగా ఎరువులను వేయడం, జీవన ఎరువులను వినియోగించడం, వ్యవసాయ సేంద్రీయ పదార్థాలను సమీకృతంగా వాడుట మరియు పచ్చిరొట్ట ఎరువులపై అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా, నేల సారవంత పెంపుదల, నేల కాలుష్యాన్ని అరికట్టడానికి అభిలంబించవలసిన వివిధ పద్ధతులను రైతులకు తెలపడం జరిగినది. ఎరువులను ఏ విధంగా ఎప్పుడు ఎలా నేలకు అందించాలని రైతులకు వివరించారు.