నందికోట్కూరు: పగిడ్యాల నామినేషన్ కేంద్రం వద్ద పోలీసుల నిఘా
నంద్యాల జిల్లా పగిడ్యాల మండల కేంద్రంలో రేపు బుధవారం నుంచి ఎంపీటీసీ నామినేషన్ స్వీకరణ ప్రారంభం కానున్న నేపథ్యంలో నామినేషన్ కేంద్రం పరిసరాలను ఆత్మకూరు డిఎస్పి రామాంజనేయ నాయక్ నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం మంగళవారం పరిశీలించారు, నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో అభ్యర్థితోపాటు ఇద్దరినీ మాత్రమే అనుమతించాలని సూచించారు, భారీ కేడ్ల ఏర్పాట్లు పరిశీలించారుఈ కార్యక్రమంలో ముచ్చుమర్రి ఎస్సై నరేంద్ర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు