జనగాం: జిల్లా కేంద్రంలో ఘనంగా ఆయుర్వేద వెల్నెస్ & యోగా వాక్
ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆయుర్వేద వెల్నెస్ మరియు యోగా వాక్‌ను డీసీపీ రాజ మహేంద్ర నాయక్ ప్రారంభించారు. నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు సాగిన ఈ ర్యాలీలో అధికారులు పాల్గొన్నారు. ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలిని, ఆయుర్వేద పద్ధతులను పాటించాలని ఈ సందర్భంగా సూచించారు.