మహబూబ్ నగర్ అర్బన్: మహబూబ్ నగర్ 25వ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్లో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి శనివారం డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పాండురంగారెడ్డి పాల్గొన్నారు.