గుంటూరు: ప్రధాని నరేంద్ర మోడీ దేశ సంపదలను కార్పొరేట్ శక్తులకు అప్పగించేలా ఉన్నారు: సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాబురావు
Guntur, Guntur | Sep 17, 2025 సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో 'వర్తమాన పరిస్థితులు-సీపీఎం వైఖరి' అనే అంశంపై బుధవారం సదస్సు జరిగింది. సీపీఎం రాష్ట్ర కార్య దర్శివర్గ సభ్యుడు బాబురావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. సీతారాం ఏచూరి స్ఫూర్తితో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటాలు చేస్తామని తెలిపారు. సీతారాం ఏచూరి ఆశయాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.