హత్నూర: జనాభా ప్రాతిపదికన బీసీలకు 42 శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాల్సిందే : బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో
జనాభా ప్రాతిపదికన బీసీలకు 42 శాతం స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బిసి సంక్షేమ సంఘం అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం సంగారెడ్డి జిల్లా ఆత్మకూరు మండలం దౌల్తాబాద్ కాసాల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్ అమలయ్యే వరకు పార్టీలకతీతంగా బీసీలు ఏకం కావాలని మరో ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.