పరకాల: హనుమకొండ: దసరా వేడుకల్లో కానిస్టేబుల్‌పై దాడి, విరిగిన చేయి
హనుమకొండ జిల్లా పరకాల మండలం రాజిపేటలో దసరా వేడుకల గొడవను ఆపేందుకు ప్రయత్నించిన మహిళా కానిస్టేబుల్ శ్రీలతపై దాడి జరిగింది. దుండగులు నెట్టివేయడంతో ఆమె కుడిచేయి విరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పవన్ తెలిపారు.