శ్రీశైలం: శ్రీశైలం శిఖరం సమీపంలో వాహనదారులకు తారసపడ్డ చిరుత పులి. సెల్ ఫోన్ లలో చిరుత పులిని చిత్రీకరించిన వాహనదారులు
శ్రీశైలం శిఖరం సమీపంలో భక్తులకు చిరుతపులి తారసపడింది సోమవారం తెల్లవారుజున కారులో శ్రీశైలం వెళ్తున్న మల్లన్న భక్తులు శిఖరం దగ్గర ఓ మలుపు వద్ద డివైడర్‌పై కూర్చున్న చిరుతను గమనించి భయాందోళనకు గురయ్యారు. డివైడర్‌పై ఉన్న చిరుతపులిని భక్తులు తమ సెల్‌ఫోన్లలో వీడియో చిత్రీకరించారు వేసవికాలం కావడంతో అడవుల నుంచి వన్యప్రాణులు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందని అటవీశాఖ హెచ్చరిస్తూ ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది