అదిలాబాద్ అర్బన్: పట్టణంలో జిల్లా బిజెపి కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్ పట్టణంలో నూతనంగా నిర్మించిన జిల్లా బీజేపి కార్యాలయాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం ప్రారంభించారు. ముందుగా ప్రత్యేక పూజలు చేసి రిబ్బన్ కట్ చేశారు. నూతనంగా ప్రారంభించిన పార్టీ కార్యాలయాన్ని వేదికగా చేసుకుని పార్టీని మరింత విస్తరించాలని కార్యకర్తలకు సూచించారు. జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నేతలు లాలా మున్న, ఆదినాథ్, దినేశ్, జోగురవి, మయూర్, తదితరులున్నారు.