శ్రీశైలం: ఎర్రగుడూరు గ్రామంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించిన పోలీసులు
పాములపాడు మండలం ఎర్రగుడూరు గ్రామంలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా గ్రామస్తులతో పోలీసులు శనివారం నాడు ప్రతిజ్ఞ చేయించారు. గ్రామంలోని బస్టాండ్ కూడాలి నందు గ్రామస్తులతో పాములపాడు ఎస్సై ప్రతిజ్ఞ చేయించారు. గ్రామంలో మాదాక ద్రవ్యాలను రానివ్వమని ఎట్టి పరిస్థితుల్లో మాదక ద్రవ్యాలను తీసుకోమని గ్రామంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడమని గ్రామస్తులతో ఎస్సై ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు రూరల్ సురేష్ కుమార్ రెడ్డి మరియు గ్రామస్తులు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.