అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో ఆదివారం ఓ వ్యక్తి నుంచి సెల్ ఫోన్ చోరీ చేస్తున్న దొంగను స్థానికులు పట్టుకున్నారు. స్థానికులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్ పూర్ నగరానికి చెందిన షంషీర్ అలీ అని చెబుతున్న వ్యక్తి మద్యం మత్తులో గుత్తి ఆర్టీసీ బస్టాండ్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. తన భార్య వస్తుండటంతో ఓ వ్యక్తి బస్టాండ్ కు వచ్చి నిల్చొని ఉండగా అతడి చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాక్కున్నాడు. గమనించిన స్థానికులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.