చోడవరం: నర్సీపట్నం రోడ్డు పనుల నిలిపివేత: కొత్తకోటలో సిపిఎం ధర్నా
అనకాపల్లి జిల్లా భీమిని పట్నం-నర్సీపట్నం రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ కొత్తకోటలో సిపిఎం పార్టీ ధర్నా నిర్వహించింది. రోడ్డు నిర్మాణం వారం రోజుల్లోనే నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, గర్భిణీ స్త్రీలు ఆసుపత్రికి వెళ్లేందుకు నరకం అనుభవిస్తున్నారని సిపిఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.