శ్రీశైలం: భక్తుల సౌకర్యాలపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఈవో శ్రీనివాసరావు
భక్తుల సదుపాయల కల్పనపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అన్నీశాఖల అధిపతులు, అన్నీ విభాగాల పర్యవేక్షకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ అన్నీ విభాగాలవారు కూడా పరస్పర సమన్వయంతో విధులు నిర్వహిస్తూ ఎప్పటికప్పడు సౌకర్యాలను మెరుగు పరుస్తుండాలన్నారు. ఇంకా వారు మాట్లాడుతూ దర్శనం ఏర్పాట్లు,మంచినీటి సదుపాయం, అన్నప్రసాదవితరణ, ఉచిత ప్రసాదవితరణ, శౌచాలయాల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణలాంటి మౌలిక వసతులపై భక్తుల నుంచి 90శాతం సానుకూల స్పందన ఉండాలన్నారు. అందుకనుగుణంగా ప్రతీ ఉద్యోగి కూడా తమ విధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు.