పార్వతీపురం: పార్వతీపురంలో 'మన్యం మర్యాద': రోడ్లపై చెత్త వేస్తే కఠిన చర్యలు!
పార్వతీపురం మన్యం జిల్లాలో బహిరంగంగా చెత్త వేసే వారిపై 'మన్యం మర్యాద' కార్యక్రమం ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. అంటువ్యాధుల నిరోధక చట్టం కింద కేసులు, జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు. దోమల నివారణకు బంతి మొక్కలు పెంచాలని సూచించారు.