మహబూబాబాద్: కొత్తగూడెం మండలంలోని ఓటాయి గ్రామం ప్రధాన రహదారి పై దిగబడిన ఆర్టీసీ బస్సు.. ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు..
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కొత్తపల్లిలో ప్రధాన రహదారి ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా రహదారిపై గుంతలు ఏర్పడి, వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు..మంత్రి సీతక్క రాక సందర్భంగా గుంతల్లో మట్టి పోయడంతో,గత రాత్రి కురిసిన వర్షానికి ఆదివారం ఉదయం 11:00 లకు ఓటాయికి వెళ్ళిన బస్సు దిగబడింది..ఎన్నో సార్లు అధికారులకు మోరపెట్టుకున్న రోడ్డు వేయడం లేదని స్థానికులు ఆరోపించారు..ఇప్పటికైనా అధికారులు డాంబర్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.