గుంతకల్లు: ఒమన్ దేశంలో చిక్కుకున్న గుంతకల్లుకు చెందిన పీరా మా.షేక్ అనే మహిళ: ఇండియాకు రప్పించాలని ఎమ్మెల్యేకు వేడుకోలు
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని సత్యనారాయణ పేటకు చెందిన పీరా మా. షేక్ అనే మహిళ ఒమన్ దేశంలో చిక్కుకుంది, ఆర్థిక కష్టాలతో అప్పులు ఉండటంతో వాటిని తీర్చడానికి ఒమన్ కు వచ్చానని అయితే ఇక్కడ వేధిస్తున్నారని చెప్పింది. అందుకు సంబంధించిన సెల్ఫీ వీడియోను బాధిత మహిళ మంగళవారం ఉదయం విడుదల చేసింది. ఇంటి పనికి తీసుకొన్చి ఇక్కడ గొర్రెలు, మేకలను మేపేందుకు పంపుతున్నారని యజమానులు కొడుతున్నారని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ తనను కాపాడి ఇండియాకు రప్పించాలని వీడియోలో వేసుకుంది.