శ్రీశైలం: పాములపాడు గ్రామ శివారులో బర్రెల గుంపును ఢీకొన్న హిటాచి ట్రైలర్ వాహనం.8 బర్రెలు అక్కడికక్కడే మృతి
పాములపాడు మండలం గ్రామ శివారులో నేషనల్ హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు నుంచి కర్నూలు వైపు హిటాచీ లోడ్‌తో వెళుతున్న ఒక ట్రైలర్ లారీ బర్రెల మందను బలంగా డీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎర్రగూడూరు గ్రామానికి చెందిన నబిరసూల్‌కు చెందిన నాలుగు బర్రెలు, సాయిరాంకు చెందిన మరో నాలుగు బర్రెలు కలిపి మొత్తం ఎనిమిది బర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ప్రమాదం జరిగిన వెంటనే ట్రైలర్ డ్రైవర్ వాహనాన్ని వదిలిపెట్టి ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. అయితే జాతీయ రహదారిపై కనీసం లైట్లు వేయకపోవడం వల్లే చీకట్లో ఈ ప్రమాదం జరిగిందని, ఇలాంటి ఘటనలు ఇక్కడ తరచూ జరుగుతున్నాయని స్థానిక గ్రామస్తులు అన్నారు