శ్రీశైలం: శ్రీశైలం నియోజకవర్గ పరిధిలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ పాల్గొన్న రాష్ట్ర బిజెపి నాయకురాలు మోమిన్ షబానా
శ్రీశైలం నియోజకవర్గ పరిధిలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై BJP రాష్ట్ర నాయకురాలు మోమిన్ షబానా బిఎల్ఎ 1 ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బండి ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకు సంబంధించిన ప్రక్రియను ప్రజలకు వివరించారు.అనంతరం నిర్వహించిన బి ఎల్ ఏ సమావేశంలో సర్ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. అవసరమైన పత్రాలను సక్రమంగా సేకరించాలని, బూత్ స్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.