కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామానికి చెందిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తల్లి చింతకుంట రత్నమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. దీనితో గురువారం ఆమె పార్థివ దేహం వద్ద ప్రముఖులు నివాళులర్పించారు.ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు,అసెంబ్లీ ఉపసభాపతి రఘురామ కృష్ణమ రాజు, తెలంగాణ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కెవీపీ రామచంద్రారావు,తదితర నాయకులు రత్నమ్మ పార్థివ దేహం వద్ద నివాళులర్పించి సీఎం రమేశ్ను పరామర్శించారు.