మడకశిరలో న్యాయవాదులు రెండు రోజులపాటు విధులు బహిష్కరించారు.
భారత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయిపై జరిగిన దాడికి నిరసనగా మడకశిర న్యాయవాదులు రెండు రోజులపాటు విధులు బహిష్కరించారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు అస్వర్ధ నారాయణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి తలమానికంగా ఉండే చీఫ్ జస్టిస్ పైనే దాడిని ఖండిస్తూ రెండు రోజులపాటు విధులు బహిష్కరించామన్నారు. దాడికి పాల్పడిన న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.