గుంతకల్లు: గుత్తి మండలం కొత్తపేట శివారులో పొలిమేర స్థలం కబ్జాకు యత్నం, జేసీబీతో స్థలం శుభ్రం చేస్తుండగా అడ్డుకున్న గ్రామస్తులు
అనంతపురం జిల్లా గుత్తి మండలం లోని కొత్తపేట గ్రామ శివారులో పొలిమేర స్థలాన్ని కొందరు ఆక్రమణకు యత్నించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు గురువారం అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి మండలం కొత్తపేట శివారులో గుత్తి పట్టణం వైపునకు వచ్చే జాతీయ రహదారి పక్కన పూర్వం నుంచి గ్రామ పొలిమేరగా ఏర్పరచుకుని గ్రామస్తులు అక్కడ పూజలు చేసేవారు. గుత్తి మున్సిపాలిటీకి కొత్తపేట గ్రామానికి పొలిమేరగా పూర్వీకులు నిర్ణయించి అక్కడే పోలేరమ్మ గుడిని ఏర్పాటు చేసి పూజలు చేసేవారు. అయితే ఆ స్థలాన్ని కబ్జాకు యత్నిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు.