సంగారెడ్డి: అంబేద్కర్ మైదానంలో అథ్లెటిక్ పోటీలు, ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు
సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ మైదానంలో అథ్లెటిక్ పోటీలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు అథ్లెటిక్ పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంబేద్కర్ మైదానంలో విద్యార్థులకు పరుగు పందెం షాట్ పుట్ లాంగ్ జంప్ త్రో బాల్ వంటి పోటీలను నిర్వహించగా విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేయడంతో పాటు విజేతలను రాష్ట్రస్థాయికి పంపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.