పత్తికొండ: క్రిష్ణగిరి మండలం ఎరుకల చెరువు గ్రామంలో రైతు ఆత్మహత్య కేసు నమోదు చేసిన పోలీసులు
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం క్రిష్ణగిరి మండలం ఎరుకల చెరువు గ్రామానికి చెందిన రైతు కురువ వెంకటరాముడు అప్పుల బాధతో భరించలేక పేడ రంగు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు. ఏడు ఎకరాల పొలం సాగు చేసి రెండేళ్లుగా నష్టాలు రావడంతో 8 లక్షల అప్పు చేశాడు. పంటలు పండే పరిస్థితి లేదని అప్పులు పెరగడంతో దిగులు చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.