శ్రీశైలం: ఆత్మకూరు మండలం సిద్ధపల్లె గ్రామంలో వడ దెబ్బ తగిలి ఉపాధి హామీ పనుల వద్ద కూలి మృతి
ఆత్మకూరు మండలం సిద్ధపల్లె గ్రామంలో సోమవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉపాధి కూలీ బండి నడిపి నాగిరెడ్డి ఉపాధి పనులు చేస్తుండగా తీవ్రమైన వడదెబ్బకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఉపాధి హామీ పథకం కింద సిద్ధపల్లె గ్రామంలో పనులు జరుగుతున్నాయి. ఎప్పటిలాగే నాగిరెడ్డి ఈరోజు ఉదయం పనులకు హాజరయ్యారు. అయితే, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పని ప్రదేశానికి చేరుకున్న కొద్దిసేపటికే ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు.తోటి కూలీలు ఆయనను రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ, ఫలితం లేకపోయింది.