అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న మండలాల్లో ఆదివారం విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. నియోజకవర్గంలోని బెలుగుప్ప కూడేరు ఉరవకొండ వజ్రకరూరు విడపనకల్లు మండలాల్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు టీడీపీ నాయకులుపూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఉరవకొండలో బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సౌభాగ్య శ్రీరామ్, మరియు దగ్గుపాటి శ్రీరామ్, బెలుగుప్పలో మాజీ ఎంపీటీసీ కంచి రాముడు నాయకులు ధనుంజయ రెడ్డి, నాయి బ్రాహ్మణ సంఘం రాయలసీమ కన్వీనర్ ధనంజయ తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలల నివాళులర్పించారు.