సంగారెడ్డి: డిసిసి అధ్యక్ష నియామకం పారదర్శకంగా చేపడతాం : ఏఐసీసీ అబ్జర్వర్ జ్యోతి రౌతేలా, స్టేట్ అబ్జర్వర్ నజీర్ అహ్మద్
డిసిసి అధ్యక్షునియా మాకమును పారదర్శకంగా చేపడతామని ఉత్తరఖండ్ మహిళా అధ్యక్షురాలు ఏఐసీసీ అబ్జర్వర్ జ్యోతి రవితేజ స్టేట్ అబ్జర్వర్ నజీర్ అహ్మద్ లు అన్నారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలోని సాయి కృష్ణ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్జర్వర్ మాట్లాడుతూ స్థానిక నాయకులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కి అభ్యర్థి నియామకం జరుగుతుందని పారదర్శకంగా జరుగుతుందని అన్నారు. పారదర్శక ఎన్నిక కోసం నియోజకవర్గంలోని అన్ని స్థాయిల కార్యకర్తలు నుంచి నాయకుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తామని అన్నారు.