శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణ సమీపంలోని గార్మెంట్ పరిశ్రమలలో హిందూపురం అదనపు జిల్లా జడ్జి కంపల్లె శైలజ న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జ్ మాట్లాడుతూ, ఒక సమాజం, కుటుంబం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే అందులో మహిళల పాత్ర ఎంతో ప్రముఖంగా ఉంటుందన్నారు. మహిళలపై ఎంతో నమ్మకంతో పారిశ్రామికవేత్తలు విరివిగా అవకాశాలు కల్పిస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి సాధించాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, ఇతర వ్యక్తులు చెప్పే ఆకర్షణీయమైన మాటల పట్ల అప్రమత్తంగా మెలగాలన్నారు. అవసరమైన మేరకు మాత్రమే సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించారు.