మధిర: ముదిగొండలో గంజాయి విక్రేతదారులను పట్టుకున్న పోలీసులు, మీడియాకు వివరాలు వెల్లడి
ముదిగొండ మండల కేంద్రంలో విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి గంజాయి విక్రయిస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. మండల కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని పట్టుకొని వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రాజారెడ్డి తెలిపారు.