మహానంది మండలంలో అద్వానంగా తయారైన పలు గ్రామాలకు వెళ్లే రహదారులు. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
మహానంది మండలం బుక్కాపురం.తిమ్మాపురం ,తిమ్మాపురం - జమాలయ్య దర్గా, శ్రీనగరం గ్రామాలకు వెళ్లే రహదారులు అద్వానంగా తయారయ్యాయి. బుక్కాపురం నుంచి తిమ్మాపురం రహదారిలో ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలకు వెళ్లే విద్యార్థుల బస్సులు,రైతులు, వివిధ పనులకు నంద్యాలకు నిత్యం వందలాది వాహనదారులు ఈ రహదారి గుండానే రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు.అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి రోడ్డు బాగు చేయాలని పలువురు వాహనదారులు,ప్రజలు కోరుతున్నారు. తారు రోడ్డు గుంతలు పడి ఎప్పుడు వాహనాలు ప్రమాదాలు గురవుతాయని వాహనదారులు భయాందోళన చెందుతున్నారు.