ఒంగోలు అర్బన్: ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేసిన రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి
Ongole Urban, Prakasam | Aug 2, 2026
భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేసిన రోజే రెండున్నర సంవత్సరంలో అభివృద్ధి చేయాలని జిఎంఆర్ సంస్థకు జగన్మోహన్ రెడ్డి తెలియచేసాడని, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఎయిర్పోర్ట్ తో పాటు పోర్టులు, ఫిషింగ్ హార్బర్ లు ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన ఘనత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వై వి సుబ్బారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. వాళ్ళు క్రెడిట్ చోరీ చేశారని వీళ్ళు, వీళ్ళు క్రెడిట్ చోరీ చేశారని వాళ్ళు అంటున్నారు అని,స్థానికంగా పోయి అడిగితే ఎయిర్పోర్ట్ అభివృద్ధి ఎవరు చేశారనేది చెబుతారు అన్నారు. ప్రభుత్వ ఆస్తులను ప్రవేట్ వాళ్లకు కట్టబెడితే చూస్తూ ఊరుకోం..మేము పోరాటం చేస్తాం