నంద్యాలలో దివంగత మాజీ ముఖ్యమంత్రి YS రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసం చేసిన ఘటనకు నిరసనగా ఆత్మకూరులో YSRCP నాయకుల ఆందోళన
నంద్యాలలో దివంగత మాజీ ముఖ్యమంత్రి Y. S. రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసం చేసిన ఘటనకు నిరసనగా ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, ఇటువంటి ఘటనలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని విమర్శించారు.