ఒంగోలు నియోజకవర్గంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకు వెళ్తున్నామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ శనివారం ఉదయం 44, 45 డివిజన్ల పరిధిలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పనితీరు పట్ల సంక్షేమ పథకాలు అందుతున్నాయని స్థానిక ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.