తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ గంగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి దేవస్థానంలో జ్వాలతోరణ మహా ఘట్టాన్ని బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా అత్యంత వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే విజయ శ్రీ కుటుంబ సభ్యులు కార్తీక పౌర్ణమి పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆకాశ దీపాన్ని వెలిగించారు. ఆలయ చైర్మన్ ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అఖండ దీపాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా వెలిగించారు. తదనంతరం జ్వాలాతోరణాన్ని MLA విజయశ్రీ వెలిగించి పూజలు చేశారు. వేలాదిగా పాల్గొన్న అశేష భక్త జనులు కార్తీక పౌర్ణమి పూజా కార్యక్రమాలు తిలకించి తరించారు.