కాకినాడ సిటీ: కాకినాడలో బాణసంచా విక్రయాలకు కొత్త రూల్స్: నవంబర్ 4లోపు అనుమతులు పూర్తి!
కాకినాడ కలెక్టర్ హరేంధరప్రసాద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. బాణసంచా తయారీ, నిల్వ, విక్రయాల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, నవంబర్ 4వ తేదీలోగా లైసెన్సుల పునరుద్ధరణ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.