కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు మరియు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్క ఉగ్ర నరసింహ రెడ్డి కనిగిరి నియోజకవర్గం లోని ఆరు మండలాలకి చెందిన టిడిపి నాయకులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో గ్రామస్థాయి నుండి టిడిపిని బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో టిడిపి గెలుపొందే విధంగా నాయకులు ఇప్పటి నుండే ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.