కనిగిరి మండలంలోని మాచవరంలో చర్చి పాస్టర్ గా పనిచేస్తున్న ఉడుముల ప్రకాష్ ను హత్య చేసిన కేసులో 12 మంది ముద్దాయిలను అరెస్టు చేసినట్లు కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ బుధవారం తెలిపారు. మాచవరంలో చర్చి పాస్టర్ గా పనిచేస్తున్న ప్రకాష్ కు అదే గ్రామానికి చెందిన చీమలదిన్నె గురవమ్మ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉందన్నారు. ఈ విషయమై గురవమ్మ బంధువులు చర్చి పాస్టర్ తో తరచూ గొడవపడే వారిని , ఈ క్రమంలో ఆగస్టు 8వ తేదీన పాస్టర్ ను ముద్దాయిలు కొట్టడంతో కనిగిరి PHC లో చికిత్స పొందుతూ, అక్కడినుండి పాస్టర్ పరారయ్యి ఒంగోలుకు చేరుకుని అక్కడ అపస్మానిక స్థితిలో మృతి చెందినట్లు తెలిపారు.