శ్రీశైలం: ఆత్మకూరు మండలం కరివేన గ్రామంలో జలధార కార్యక్రమంలో భాగంగా పూడికతీత పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
జలమే జీవం, జల సంరక్షణే ధ్యేయం అని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆత్మకూరు మండలం కరివేన చెరువు కాలువ వద్ద జలధార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీలతో కలిసి కాలువలో పూడికతీత పనులు చేపట్టారు. భావితరాలకు నీటి ఎద్దడి లేకుండా చూడడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. చెరువుల పునరుద్ధరణ ద్వారా వర్షపునీటిని వడిసిపట్టి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు.