కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ రవీంద్ర బాబు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు. అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. స్థానిక సమస్యలుంటే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.