కర్నూలు: మహిళలను కించపరిస్తే కఠిన చర్యలు తప్పవన్న కర్నూలు బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గీత మాధురి
మహిళలను కించపరిస్తే కఠిన చర్యలు తప్పని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గీతా మాధురి, జిల్లా మహిళా అధ్యక్షురాలు గొందిపర్ల మాలతి అన్నారు. సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజు, ఆ వ్యాఖ్యలను సమర్థించిన ఓ టీవీ ఛానల్ ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావులపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.