శ్రీశైలం: ఆత్మకూరు మండలం సంజీవనగర్ తాండ సమీపంలో మొక్కజొన్న లోడ్ తో వెళ్తున్న లారీ అగ్నిప్రమాదం
ఆత్మకూరు మండలం సంజీవనగర్ తాండ వద్ద సోమవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. మాచర్ల మండలం దుర్గి గ్రామం నుంచి నుంచి నందికొట్కూరుకు వెళ్తున్న మొక్కజొన్న లోడు లారీ టైర్లు రాపిడికి గురై మంటలు చెలరేగాయి. గమనించిన లారీ డ్రైవర్ సకాలంలో గ్రామస్తులకు సమాచారం అందించడంతో గ్రామస్తులు వెంటనే స్పందించి మంటలను అదుపు చేయడంతో భారీ నష్టం తప్పింది. ఈ ప్రమాదంలో దానకు గాని లారీకి గాని ఎటువంటి నష్టం వాటిల్ల లేదని పోలీసులు తెలియజేశారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు ఫైరింజన్ మంటలను పూర్తిగా అదుపులోకి చేశారు.