మునగాల: మునగాల మండలంలో రోడ్ల కోసం ప్రజల ఎదురుచూపులు: రేపాల లింకు రోడ్లపై స్థానికుల విజ్ఞప్తి
మునగాల మండలంలోని రేపాల-కలకోవ, రేపాల-మాధవరం లింకు రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు. సరైన రోడ్లు లేక చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోందని, అత్యవసర వైద్య సేవలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.