ఉద్యాన పంటలు సాధారణ పంటలతో పోలిస్తే ఎంతో లాభదాయకమైనవని, తక్కువ మట్టిలో అధిక దిగుబడి సాధించగలవని వ్యవసాయ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు జిల్లా రైతుల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న "రైతన్నా.. మీకోసం" కార్యక్రమంలో భాగంగా.. బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని మండలాల్లో ఏర్పాటు చేసిన చేసిన రైతు సమావేశాల్లో.. వ్యవసాయం, ప్రకృతి సేద్యం, సహజ సాగు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో.. ప్రకృతి వ్యవసాయం,