శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని సత్యనారాయణపేటలో భాను తేజ అనే డిగ్రీ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఫోను ఎక్కువగా చూస్తుందని తల్లిదండ్రులు దండించినందుకు మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుందని స్థానికులు తెలిపారు. తల్లి సుబ్బలక్ష్మి ఫిర్యాదు మేరకు హిందూపురం వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.