శ్రీశైలం: శ్రీశైల దేవస్థానంలో వర్షాకాలం సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన EO శ్రీనివాసరావు
దేవస్థానం పరిధిలో యోగాంధ్ర, అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల ఏర్పాట్లపై కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. యోగా శిక్షణా కార్యక్రమాలను జూన్ 20 వరకు ప్రతిరోజూ నిర్వహించి, స్థానికులు మరియు యాత్రికులను భాగస్వాములను చేయాలని సూచించారు. అదేవిధంగా రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డార్మిటరీలు, భవనాల్లో విద్యుత్ వైరింగ్ తనిఖీలు, పారిశుద్ధ్య నిర్వహణ, జంగిల్ క్లియరెన్స్ పనులను చేపట్టాలని ఈవో అన్నారు.