నసురుల్లాబాద్: కాంసెట్ పల్లి నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మించుకోవాలి: ఎంపీడీవో సూర్యకాంత్
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలని నస్రుల్లాబాద్ ఎంపీడీవో సూర్యకాంత్ సూచించారు. గురువారం నస్రుల్లాబాద్ మండలం కాంసెట్ పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అధికారులు ముగ్గు వేశారు. అనంతరం ఎంపీడీవో సూర్యకాంత్ మాట్లాడుతూ.. లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్లను నిర్మించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ, హౌసింగ్ ఏఈ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.