జమ్మికుంట: జమ్మికుంటలో కత్తులతో దాడి: డబ్బుల విషయంలో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ
కరీంనగర్ జిల్లా జమ్మికుంట బస్టాండ్ సమీపంలో డబ్బుల విషయంలో ఇద్దరు మొబైల్ షాపు నిర్వాహకుల మధ్య ఘర్షణ జరిగి, కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలవ్వడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.