కథలాపూర్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలు పట్టివేత: ఎస్సై నవీన్ కుమార్
జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ మండలం దూలూరు గ్రామ శివారులోని వాగులో నుంచి అక్రమంగా ఇసుకను నిజామాబాద్ జిల్లాకు టిప్పర్లో తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై నవీన్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీస్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ కనిపించిందన్నారు. టిప్పర్ను పట్టుకొని నిజామాబాద్ జిల్లాకు చెందిన టిప్పర్ డ్రైవర్ ఎండీ నజీర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. మండల కేంద్రంలోని తండ్రియాల గ్రామ శివారులో కూడా పలు ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్నట్టు తెలిపారు.