హిందూపురంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేసిన ప్రజా ఉద్యమం లో ఉద్రిక్తత
వైఎస్ ఆర్ సి పి సమన్వయకర్త దీపిక ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన బైక్ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు హిందూపురం వైసీపీ కార్యాలయం చేరుకుని బైక్ ర్యాలీ కాకుండా నడుచుకుంటూ ర్యాలీ చేయాలని వైసిపి సమన్వయకర్తతో విజ్ఞప్తి చేశారు,వైసీపీ కార్యాలయం నుండి కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలి అని నినాదాలు చేస్తూ తహాసిల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు, వందలాదిమంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మార్వో కు వినతి పత్రం ఇవ్వాలని చూడగా కార్యాలయంలో సిబ్బంది ఎవరు లేకపోవడంతో ఆగ్రహించిన వైసిపి శ్రేణులు ఇందిరమ్మ సర్కిల్లో రోడ్డుపై బైఠాయించారు