శ్రీశైలం: శ్రీశైల దేవస్థానంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రధాన లక్ష్యం : ఈవో శ్రీనివాసరావు
శ్రీశైల దేవస్థానంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని eo శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో దర్శనం, త్రాగునీరు, అన్నప్రసాద వితరణ, శౌచాలయాలు, పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. క్యూలైన్లలో నిరంతరం మంచినీరు, అల్పాహారం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అన్నప్రసాద నాణ్యత, పరిశుభ్రతను పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలపై ఆలయ ప్రసార వ్యవస్థ ద్వారా భక్తులకు నిరంతరం సమాచారం అందించాలని సూచించారు.